అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జనవరిలో మెగాజాబ్ క్యాలెండర్ నిర్వహిస్తానని ఎన్నికల ముందు ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజల తలపై చేతివేసి చెప్పిన జగనన్న జాబ్ క్యాలెండరు ఏమైందని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రశ్నించారు. పాతపట్నం మేజర్ పంచాయతీ గోపాలపురం ప్రాంతంలో శనివారం ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ప్రజల నుంచి సర్వే రూపంలో ప్రశ్నలకు జవాబులను రాబట్టారు. వాలంటీర్ల ఉద్యోగాలైనా ప్రతి ఏడాది నిర్వహించే జాబ్ మేళా అని విమర్శ చేశారు. ప్రతి నెల నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని ఇది జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదా అని నిలదీశారు.