పులివెందుల పురపాలక పరిధిలో వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ అన్నారు. వర్షాకాలం దృష్ట్యా ఇళ్లల్లోకి ప్రవహించకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. పులివెందుల పట్టణంలో స్థానిక నగరిగుట్ట లో బాధితురాలు సుధారాణి చైర్మన్ కు చరవాణి ద్వారా ఇళ్లల్లోకి నీరు వస్తున్నాయని తెలపడంతో ఆయన స్పందించి సంబంధిత ప్రదేశానికి వెళ్లి పరిశీలించి వర్షపు నీరు రాకుండా సంబంధిత అధికారుల ద్వారా తగుచర్యలు తీసుకుంటామని బాధితురాలకి కితాబు ఇచ్చారు వర్షాకాలం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యలను తెలపాలన్నారు ప్రభుత్వము బాధితులకు అండగా నిలుస్తుంది అన్నారు పురపాలక పరిధిలో ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈకార్యక్రమంలో పుర వైస్ చైర్మన్ హఫీజ్ ఉన్నారు.