జిల్లాలో తుఫాన్ వల్ల రాకపోకలు స్తంభించిపోయాయని, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంతో, పేదలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు బినయ్ విశ్వం డిమాండ్ చేశారు. శనివారం కడప కలెక్టరేట్ లోని విపత్తుల శాఖ కంట్రోల్ రూమ్ పరిశీలించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర తుఫాను వల్ల ప్రజలు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరేట్ లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని ప్రకటించినప్పటికీ ఆచరణలో క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే అధికారులు ఆఫీసుకు రాకుండా ఏమి చేస్తున్నారని అధికారులను నిలదీశారు. డి సెక్షన్ లోని విపత్తుల శాఖ విభాగం సూపర్నెంట్ వెంకట్రామిరెడ్డిని ప్రశ్నించగా తనకేమీ తెలియదని జిల్లా అధికారులతో మాట్లాడాలని చెప్పడం, రెండవ శనివారం వల్ల అధికారులు ఎవరూ రాలేదని చెప్పడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. విపత్తుల సమయాలలో జగన్మోహన్ రెడ్డి సెలవు దినాలతో సంబంధం లేదని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో చర్చించేందుకు కలెక్టర్ కు ఫోన్ చేసినప్పటికీ , సంక్షిప్త సందేశం పంపిన స్పందించకపోవడం దారుణమన్నారు. ఎంపీతో కూడా మాట్లాడనంత నిర్లక్ష్యం సరి కాదన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి అందుబాటులో లేకపోవడం విచారకరమన్నారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఆహారము సరఫరా చేయాలని, వ్యాధులు ప్రజల కుండా మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు లేఖ పంపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టకపోతే ఆందోళన చెపడతావని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి ఈశ్వరయ్య, గాలి చంద్ర సిపిఐ నగర సహాయ కార్యదర్శి కేసి బాదుల్లా పాల్గొన్నారు.