తల్లి పక్కనే నిద్రిస్తున్న 8 నెలల బాలుడిపై అడవి పిల్లి విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ విషాదం యూపీలో జరిగింది. ప్రతాప్‌గఢ్‌లో మహులికి చెందిన అజయ్ గౌర్‌కి ఐదుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. కూలీ పనుల కోసం అజయ్ వలస వెళ్లగా అతడి భార్య ఉమ గురువారం రాత్రి తన బాబుతో కలిసి నిద్రిస్తుంది. హఠాత్తుగా ఓ అడవి పిల్లి కిటికీలోంచి వారి గదిలోకి వచ్చి రాజ్ శరీరంపై గోళ్లతో దాడి చేసింది. ఉమనూ గాయపరిచి పారిపోయింది. రాజ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు.