చీపురుపల్లి మండలం, పెదనడిపల్లి పాక్స్ సోసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్సార్ పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వైస్సార్ పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, సొసైటీ అధ్యక్షులు పిసిని శ్రీను శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ చీపురుపల్లి లో ఉన్న మూడు సొసైటీలు, రైతు భరోసా కేంద్రం లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశామని, రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని, అన్ని కొనుగోలు కేంద్రాల్లో ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తున్నాం అని రైతుల కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా ట్రాన్స్పోర్ట్, హమాలీ చార్జ్ లు, గొనె సంచులు అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మాత్రమే రైతులు ధాన్యం అమ్మాలి అని, మధ్యలో ఎటువంటి దళారీ వ్యవస్థ ఉండకూడదు అని ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు.
మీ సమక్షంలో మీ గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు,
ఏ రైతు కూడా తన పంటని కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు అన్నారు.
దళారు లేక మధ్యవర్తులు లేక మిల్లర్ చేతిలో మన రైతన్నలు నష్టపోకూడదు. ఎటువంటి మోసాలకు తావు ఉండకూడదని, రైతు భరోసా కేంద్రాలు ,ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి.ఈ కేంద్రంలో కనీస మద్దతు ధరకు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చును.
కనీస మద్దతు ధర సాధారణ రకం రూll 2040/- ,ఏ గ్రేడ్ రకం రూ ll 2060/- ,100 కేజీలకు కొనుగోలు చేస్తారు. ఒకవేళ రైతే గోని సంచులు గాని ,హమాలీలు గాని ,రవాణా ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ పైకం నేరుగా రైతు ఖాతాలోకి ధాన్యం సొమ్ము సహా 21 రోజుల్లో చెల్లించబడుతుంది. పై సేవలకు ప్రభుత్వం చెల్లించే సొమ్ము వివరాలు మీ రైతు భరోసా కేంద్రంలలో తెలుసుకోనవచ్చు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వై యస్ ర్ పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వై యస్ ర్ పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, సొసైటీ అధ్యక్షులు పిసిని శ్రీను, సొసైటీ పరిధిలో నాయకులు సర్పంచ్ పాల్ రాజ్, ఎంపీటీసీ రేగాన ఆదినారాయణ, చిననడిపల్లి సర్పంచ్ గడే సత్యవతి, గడే రామునాయుడు, మండల సర్పంచ్లు గొర్రెల శ్రీరాములునాయుడు, మీసాల వెంకటరమణ, కోరాడ పృథ్వి, రెల్లి అప్పలనాయుడు, బైరెడ్డి లక్ష్మణరావు, కర్ణం చిన్నం నాయుడు, గొర్రెల వెంకటరమణ ,రెల్లి వెంకటేష్, బైరెడ్డి సూరి సత్యం సోసైటీ డైరక్టర్స్ , విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ యామిని, ప్రభాత్ కుమార్, చంద్రశేఖర్ గుప్త, సొసైటీ సెక్రటరీ సూర్యనారాయణ , రైతు భరోసా కేంద్రం సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.