వైసీపీ అసమర్థ పాలనలో హంగులే తప్ప అభివృద్ధి లేదని మాజీ విప్ ఎమ్మెల్యే కూన రవికుమార్ విమర్శించారు. బూర్జ మండలం తుడ్డలి గ్రామంలో శనివారం సాయంత్రం 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం నిర్వహించారు. మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారని ప్రజలను రప్పించి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. బీసీలకు ఏమి చేశారని బీసీ గర్జన సభ నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో 'ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి ' కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గ్రామంలో మన రాష్ట్రానికి ఇదేమి ఖర్మరా బాబు కార్యక్రమాన్ని గోడపత్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై దారాలను మోపుతుందన్నారు. నిరుద్యోగం ప్రజా సమస్యలు పెరిగాయన్నారు. సమస్యలపై ప్రజలతో మాట్లాడి వారి ఫోన్ నెంబర్ నుండి టిడిపి కాల్ సెంటర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం జరుగుతుందన్నారుప్రజా సమస్యలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధికి నోచుకోకుండా జగన్ వైరస్ అడ్డుపడుతోందని, దాన్ని ప్రజలంతా కలిసి సమూలంగా నిర్మూలించాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు అభివృద్ధి వైపు అడుగులు వేస్తే జగన్ కూలగొట్టడంతోనే పాలన ప్రారంభించారన్నారు. ప్రజలు తెదేపా అధికారంలోని రావాలని బలంగా కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో, మండల అధ్యక్షుల వి. రాంజీ, సర్పంచ్ ఎం రూపవతి లంకజగన్నాథం, కే. కృష్ణ, బెనర్జీ , రాంబాబు, కన్నంనాయుడు, సీతారామరాజు, గణపతి, గోపి, రామకృష్ణ, నారాయణరావు. ఆదినారాయణ శ్రీనివాసరావు, పాల్గొన్నారు