బిడ్డ పుట్టక ముందే దత్తత తీసుకునేందుకు చట్టంలో అవకాశం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. నగదు కోసం జరిగే ఇలాంటి ఒప్పందాలకు చట్టంలో చోటెలా సాధ్యమని ధర్మాసనం ప్రశ్నించింది. ముందుగా చేసుకున్న దత్తత నిబంధనలకు అనుగుణంగా రెండేళ్ల 9 నెలల ఆడబిడ్డను పెంచుకునేందుకు అవకాశమివ్వాలని ఓ ముస్లిం దంపతులు ఉడుపి జిల్లా న్యాయస్థానంలో ఆర్జీలు దాఖలు చేశారు. దీన్ని కోర్టు కొట్టేయగా హైకోర్టును ఆశ్రయించారు. మహ్మదీయ చట్టాలు, సిద్ధాంతాల ప్రకారం బిడ్డ పుట్టక ముందే దత్తత ఒప్పందాలు సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది.