మాండూస్ తుపాన్ క్రమంలో జిల్లాలో రెండు రోజులు భారీ నుంచీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నదులు, వాగులు, వంకలు ప్రవహించే అవకాశం! ఉందని ఇంచార్జ్ డిఆర్ఓ భాగ్యరేఖ పేర్కొన్నారు. నదీ తీర ప్రాంతవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెన్నానది, చిత్రావతి, జయమంగళి, పాపాగ్ని, మద్దిలేరు ప్రవహించే ప్రాంతాలైన రాష్ట్రం, పరిగి, గోరంట్ల, పుట్టపర్తి తదితర ప్రాంతాలవారు నిరంతరం జాగురూకతతో ఉండాలన్నారు. రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం చేశామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్తగా పోలీస్, అగ్ని మాపక రెవెన్యూ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్ధృతి పెరిగితే ఎలాంటి చర్యలు తీసు కోవాలో కార్యాచరణతో సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.