బాపట్ల జిల్లా ఎస్పీ జిందాల్ ఆదేశాల మేరకు కారంచేడు ఎస్సై అనిత ఆధ్వర్యంలో శనివారం నో యాక్సిడెంట్ డే కార్యక్రమం జరిగింది. ప్రధాన కూడళ్ళలో పోలీసు బృందాలు కాపు కాసి వాహన తనిఖీలు నిర్వహించారు. పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని ఎస్సై అనిత సూచించారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధారణ తప్పనిసరని స్పష్టం చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని వెళుతున్న ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సరైన అనుమతి పత్రాలు లేకున్నా, రోడ్డు భద్రతా నియమాలు పాటించకున్నా చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఎస్ఐ అనిత హెచ్చరించారు.