బ్యాంకుకు వెళ్తు న్నామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదని అందిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్. ఐ. రమేష్ బాబు శనివారం తెలిపారు. తిరుపతి శివజ్యోతినగర్కు చెందిన సత్యనారాయణరాజు (60) అనారోగ్యం కార ణంగా కుటుంబంతో కలిసి గత నెలలో చిన్నమండెం మండలంలోని బోడిరెడ్డిగారిపల్లెలోని కుమార్తె వద్దకు వచ్చారు. ఈ నెల 2న బ్యాంకు పని మీద ఇంటి నుంచి చిన్నమండెం వెళ్లి ఆయన తిరిగి రాలేదు. దీంతో ఆయన కుమారుడు నిఖిల్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.