రాయచోటి పట్టణం రెడ్డీస్ కాలనీలో శనివారం రాత్రి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పెద్దమండెం మండలం పాపేపల్లెకు చెందిన నరసింహులు (50) తన భార్యతో విబేధాల కారణంగా 14 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల వారి కుమార్తె వివాహ సమయంలో తిరిగి భార్య వద్దకు చేరారు. ఈ క్రమంలో నిత్యం మద్యం తాగుతూ ఉండటంతో తాగొద్దని కుటుంబ సభ్యులు మందలించ డంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నామని ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు.