2023లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 60 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.ఈ మేరకు ఆప్ కర్ణాటక శాఖ ఉపాధ్యక్షుడు, మాజీ డీజీపీ భాస్కర్ రావు వివరాలు వెల్లడించారు. ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల తర్వాత గుజరాత్‌లోనూ ఖాతా తెరిచారు. 15 ఏళ్లుగా బీజేపీ ఆధీనంలో ఉన్న ఢిల్లీ కార్పొరేషన్‌లో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఎన్నికల ప్రచారానికి వస్తారని చెప్పారు.