అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని నెల్లూరు పట్టణంలోని రావు బహుదూర్ రేబాల లక్ష్మీ నరసారెడ్డి ఫంక్షన్ హాల్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలందించిన వారిని గుర్తించి సమాజసేవ పురస్కారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా దువ్వూరు మండలం నేలటూరు గ్రామానికి చెందిన కెఎస్ఆర్ హరిత ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సేవా, సామాజిక కార్యక్రమాలు గుర్తించి చైర్మన్ కదిరి సంజీవ రాయుడు యాదవ్ కు నెల్లూరు జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం. అరుణ, నగర మేయర్ స్రవంతి జయ వర్ధన్, వరల్డ్ హ్యూమన్ రైట్స్ జాతీయ చైర్మన్ మొరం రెడ్డి సుబ్బారెడ్డి, కడప అసోసియేషన్ ఫర్ సర్వీస్ సొసైటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి చేతుల మీదగా సమాజ సేవ పురస్కారం- 2022 అందుకోవడం జరిగింది. ఈ పురస్కారం సంస్థకు సపోర్ట్ చేసే దాతలకు, కేఎస్ఆర్ హరిత ఫౌండేషన్ సభ్యులకు అంకితం ఇస్తున్నట్లు చైర్మన్ కదిరి సంజీవ రాయుడు యాదవ్ తెలిపారు.