బంగాళాఖాతంలో ఏర్పడి, ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో తీరం దాటిన మాండస్ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. తమిళనాడు, ఏపీలో రెండ్రోజులుగా విస్తారంగా వానలు పడుతున్నాయి. ఇక ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోపక్క చలి కాలం కావడం, తుపాను ప్రభావంతో చలి తీవ్రత అధికంగా ఉండొచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు.