ఏపీ కేబినెట్ ఈ నెల 13న (మంగళవారం) సమావేశం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రగతి పనులు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. కేబినెట్ ఆమోదం కోసం పంపే ప్రతిపాదనలను ఆయా శాఖల అధికారులు ఈ నెల 9వ తేదీ సా.4 గంటల్లోగా పంపాలని ఆదేశిస్తూ సీఎస్ గతంలో ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. గత కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతికి సంబంధించిన నివేదికను కూడా సమర్పించాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa