ఆఫ్గానిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని బలూచిస్థాన్ చమన్ జిల్లాలో ఆదివారం అలజడి నెలకొంది. పాక్ పౌరులపై అఫ్గాన్ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ దాడిలో పదిమంది మృతి చెందగా, 17 మందికి గాయాలయ్యాయి. కాల్పులకు ఫిరంగులు, మోర్టార్లు వంటి భారీ ఆయుధాలను ఉపయోగించినట్లు పాక్ మీడియా, ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. కాల్పులకు కారణం ఇంకా తెలియరాలేదు. అటు అఫ్గాన్‌లోనూ ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. ఖైబర్‌పక్తుంక్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో గత నెలలో రోడ్డు నిర్మాణం విషయంలో కాల్పులు జరగ్గా ఇద్దరు చిన్నారులతో కలిపి ఎనిమిది మంది మరణించారు.