ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 01:38 PM

వైసీపీ ప్రభుత్వ నిరంకుశ,అరాచక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిపాడు  నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ వరుపుల రాజా కోరారు. ప్రత్తిపాడు మండలంలోని భౌరువార గిరిజన గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించి జగన్‌ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. భౌరువాక గిరిజనులు రహదారులు, తాగునీరు, గృహాలు, విద్యుత్‌, తదితర సమస్యలతో సతమతమవుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు కొమ్ముల కన్నబాబు, మండలాధ్యక్షుడు అమరాది వెంకట్రావు, నాయకులు యాళ్ళ జగదీష్‌, పల్లా గోపి, బొల్లు కొండబాబు, దాకారపు కృష్ణ, కుంచే తమ్మారావు, పట్టెం అప్పారావు, నందా కొండబాబు, లోవరాజు, సూరిబాబు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com