ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్కు చెందిన నగ్న వీడియోలు ఇప్పుడు నెట్టింట కలకలం సృష్టిస్తున్నాయి. ఆ ఇన్స్పెక్టర్ ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఒక కళాశాల నిర్వాహక భాగస్వామికి అల్లుడు. ప్రస్తుతం తణుకులో పనిచేస్తున్నారు. కర్నూలులో విధులు నిర్వహించే సమయంలో తనతో పాటు పనిచేసే ఒంగోలుకు చెందిన ఓ మహిళా అధికారిణిని లోబరుచుకుని లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి. తన భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానంటూ ఆ అధికారిణిని నమ్మించి మోసగించినట్లు తెలిసింది. పోలీసులను ఆశ్రయించినా తనకు న్యాయం జరగలేదంటూ ఆమె ఇప్పుడు మీడియాను ఆశ్రయించారు. ఈ విషయమై ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ కుటుంబం నుంచి తనను విడదీయడానికి ఆ అధికారిణి బెదిరింపులకు పాల్పడుతోందని అన్నారు. ఈ వీడియోల వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.