శిక్ష పడుతుందేమో అనే భయంతో విచారణ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలోని ఉడుపి జైలులో చోటుచేసుకుంది. ఈ ఏడాది జూలై 12న ఉడుపి ఒత్తినెణె సమీపంలోని హేనబేరు రోడ్డులో ఆనంద దేవాడిగ అనే వ్యక్తిని సదానంద, అతని స్నేహితురాలు శిల్ప సాయంతో పిలుచుకువచ్చి , ఆయనకు నిద్రమాత్రలు ఇచ్చి కారుతో సహా నిప్పుపెట్టారు. ఈ కేసులో సదానంద ప్రస్తుతం ఉడుపి జైలులో ఉన్నాడు. కోర్టులో శిక్ష ఎక్కువ పడుతుందనే భయంతో జైలు బ్యారెక్ లో సదానంద ఆదివారం తెల్లవారుజామున పంచెతో ఉరి వేసుకున్నాడు. దీన్ని గమనించిన తోటి ఖైదీలు జైలు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు.