ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగుల్ని నయవంచన చేసిన ప్రభుత్వం వైసీపీ నే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 01:40 PM

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. గత టీడీపీ హయాంలోనే సంక్షేమ పథకాలు బాగా అందేవని, వైసీపీ ప్రభుత్వంలో పథకాలు రాకుండా మధ్య దళారులు అడ్డుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ విజయరామిరెడ్డి, నరసింహులు, హనుమంతు, ఈశ్వర్‌, జోజి, నీలకంఠ, రమేష్‌, దేవేంద్ర, హనుమంతు, కరెప్ప, మల్లేష్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com