అగ్ని భగ్గుమంటేనే ఊహించలేని పరిస్థితి. అలాంటిది అగ్నిపర్వతం బద్దలైతే పరిస్థితి ఏంటీ..? ఇదిలావుంటే చిలీలోని ఓ అగ్ని పర్వతం బద్దలైంది. ఆండిస్ పర్వతాల్లో ఉన్న లాస్కర్ అగ్నిపర్వతం బ్లాస్ట్ అయింది. శనివారం మధ్యాహ్నం 12.36 గంటలకు విస్పోటనం చెందిందని నేషనల్ జియాలజి అండ్ మైనింగ్ సర్వీస్ వెల్లడించింది. అగ్ని పర్వతం బద్దలైనప్పుడు స్వల్పంగా భూమి కంపించినట్టు తెలుస్తుంది. దీంతో అగ్ని పర్వతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్బ్రే నగరంలోని ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు.