ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ అంశం ఉనికిలోనే లేదు..ప్రత్యేక హోదాపై తేల్చిచెప్పిన కేంద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 08:40 PM

పదేళ్లు కాదు పదిహేనేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా అని హామీ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక మాటమార్చిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇక ముగిసిన అధ్యాయం అని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని రాజ్యసభ సాక్షిగా వెల్లడించింది. కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ దీనిపై రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ)కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిందని వెల్లడించారు. 14వ ఆర్థికసంఘం కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ అంశంలో ఎలాంటి వ్యత్యాసం చూపలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు మంత్రి స్పందించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com