భార్యాభర్తల మధ్య స్మార్ట్‌ఫోన్ చిచ్చు పెడుతోందని ఓ అధ్యయనంలో తేలింది. 67 శాతం మంది వినియోగదారులు తమ జీవిత భాగస్వామి పక్కనే ఉన్నా స్మార్ట్‌ఫోన్ వాడుతున్నామని అంగీకరించారు. ఖాళీగా ఉన్నా జీవిత భాగస్వామితో కనీసం మాట్లాడటం లేదని ఒప్పుకున్నారు. ఫోన్లను మితిమీరి వాడటం వల్ల వివాహ బంధాలు దెబ్బతింటున్నాయని 88 శాతం మంది వాపోయారు. రోజుకు సగటున 1.5 గంటల ఖాళీ సమయం దొరుకుతున్నా.. ఆ సమయంలోనూ చాలా మంది ఫోన్‌ను వదలడంలేదని ఈ సర్వేలో వెల్లడైంది.