‘‘ఓటర్లను ప్రభావితం చేయడానికి వలంటీర్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వలంటీర్ల ప్రమేయం లేకుండా తగు చర్యలు తీసుకోవాలి’’ అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు టీడీపీ విజ్ఞప్తి చేసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సోమవారం అమరావతి సచివాలయంలో మీనాను కలిసి ఆ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ వలంటీర్ల ను దుర్వినియోగం చేస్తోంది. అధికార పార్టీకి ఓటేయకపోతే సంక్షేమ ఫలాలు ఆగిపోతాయని వలంటీర్లు బెదిరింపులకు దిగుతున్నారు. కొన్నిచోట్ల గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో అనర్హులను కూడా ఓటర్లుగా నమోదు చేశారు. అధికారపార్టీ ఓటు బ్యాంకు పెంచుకునే వ్యవస్థగా వలంటీర్లను వినియోగిస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వాడుకున్నా రు. ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లోనూ వలంటీర్లను వాడుతున్నా రు. ఇది సరైంది కాదని సీఈవోకు ఫిర్యాదు చేశాం. వలంటీ ర్ వ్యవస్థను కులగణనకు ఎలా ఉపయోగిస్తారు? అలా చేయ డం చట్ట వ్యతిరేకం. ఓటు నమోదు ప్రక్రియలో పాల్గొన్న వలంటీర్లపై చర్యలు తీసుకోవాలి’’ అని కోరామని తెలిపారు.