చిత్తూరు జిల్లాలో నకిలీ డిపార్ట్‌మెంటల్ ఆర్డర్‌లతో ఉద్యోగాల్లో చేరిన వ్యవహారంలో ఏడుగురు హోంగార్డులను అరెస్టు చేశారు. రానున్న రోజుల్లో మరింత మంది అరెస్టయ్యే అవకాశాలున్నాయి. 2014-19 మధ్యకాలంలో నకిలీ ఆర్డర్‌లతో చాలా మంది హోంగార్డు ఉద్యోగాల్లో చేరారని పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారణ చేపట్టి 87 మంది ప్రభుత్వ అనుమతి లేకుండానే విధుల్లో చేరారని తేల్చారు. రెండు రోజుల క్రితం వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.