టీటీడీ వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి లడ్డూలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa