ఏకంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లనే చోరీ చేసిన ఘటన బీహార్ లో జరిగింది. సీవాన్ జిల్లాలోని 5 గ్రామాల్లో ఆదివారం రాత్రి దొంగలు ట్రాన్స్ ఫార్మర్లను దొంగిలించారు. దీంతో ఆ గ్రామాల్లో కరెంట్ లేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తక్షణమే స్పందించిన విద్యుత్ అధికారులు 16 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్లను సోమవారం ఏర్పాటు చేసి తిరిగి గ్రామాల్లో కరెంట్ సరఫరా పునరుద్ధరించారు. చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ఎవరో కావాలనే చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.