భారత్ – చైనా జవాన్ల మధ్య డిసెంబర్ 9న ఘర్షణ జరిగి 30 మంది సైనికులు గాయపడినట్లు భారత సైన్యం ధ్రువీకరించింది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వద్ద ఈ ఘటన జరగ్గా.. ఇరు దేశాలు ఆ ప్రాంతంలో భారీగా సైనికులను మోహరించాయి. ఈ క్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. ఈ ఘర్షణపై ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. కాగా, తవాంగ్ ప్రాంతం భూటాన్, టిబెట్ లతో సరిహద్దు పంచుకుంటోంది. ఇది దక్షిణ టిబెట్ లో భాగమని వాదిస్తోన్న డ్రాగన్, దాన్ని సొంతం చేసుకోవాలని కుట్రలు చేస్తోంది.