ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వాణిజ్య వాహనాల ధరలను జనవరి 2023 నుంచి 2 శాతం వరకు పెంచనున్నట్లు మంగళవారం తెలిపింది. మోడల్, వేరియంట్ ప్రకారం ధరల పెంపు ఉంటుందని పేర్కొంది. ధరల పెంపు అన్ని కమర్షియల్ వెహికల్స్‌కు వర్తిస్తుందని తెలిపింది. వాహనాల ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. స్టీల్, అల్యూమినియం ధరలు ఈ సంవత్సరం పెరిగాయి. దీంతో ట్రక్కులు, బస్సుల నిర్మాణ ఖర్చులు ఇప్పటి వరకు ఎక్కువగా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa