తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ నేడు టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబుతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. భారత్, బ్రిటన్ దేశాల మధ్య సంబంధాలు, జీ-20కి భారత్ నాయకత్వం తదితర అంశాలు వీరిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. ఈ భేటీ సందర్భంగా చంద్రబాబు... గారెత్ విన్ ఓవెన్ ను శాలువా కప్పి సన్మానించారు. గారెత్ విన్ ఓవెన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గా ఇటీవలే బాధ్యతలు అందుకున్నారు. ఆయనకు ముందు ఆండ్రూ ఫ్లెమింగ్ ఈ బాధ్యతలు నిర్వర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa