కడప జిల్లా సిద్ధపటం మండలంలోని పి కొత్తపల్లిలో వైద్య సిబ్బంది బుధవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందు బిళ్ళలు పంపిణీ చేశామని వారు తెలిపారు. ఎలాంటి జబ్బులు వచ్చిన ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం లేదని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని వారు సూచించారు.