ప్రభుత్వ వైఫల్యాలను 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం ద్వారా ఇంటింటికీ తీసుకెళ్లాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్య క్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం వల్లూరు మండలం, మాచిరెడ్డిపల్లోలోని స్వగృహంలో పెద్ద చెప్పలి, చిన్న చెప్పలి, లేటపల్లె, పొడదుర్తి గ్రామాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. పుత్తా మాట్లాడుతూ మండల కన్వీనర్ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు అడిగి రాసుకోవాలన్నారు. తెదేపా ప్రభుత్వం వచ్చాక చంద్రబాబునాయుడు ఏమేమి చేస్తామన్నారో వాటిని ప్రజలకు వివరించాలని సూచించారు.