దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 240 పాయింట్ల లాభంతో 62,774 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 66 పాయింట్లు లాభపడి 18,674 వద్ద ట్రేడవుతోంది. డాలరతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.63 వద్ద ట్రేడవుతోంది. విప్రో, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎన్ టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఎల్అండ్ టీ, టీసీఎస్, హెచ్ సీఎల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, భారతీ ఎయిర్ టెల్, హెచ్ యూఎల్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.