మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆగడం లేదు. డ్రగ్స్ రవాణా కోసం దుండగులు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా అస్సాంలో అంబులెన్సులో డ్రగ్స్ ను సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గౌహతి నగరంలో అంబులెన్సులో అక్రమంగా తరలిస్తున్న 50,000 యాబా టాబ్లెట్లు, 200 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు రూ. 14 కోట్లు ఉంటుందని, ఒకరిని అరెస్టు చేశామని గౌహతి జాయింట్ సీపీ పార్థ సారథి మహంతి వెల్లడించారు.