ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం కింద కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ఇళ్లల్లో కేవలం ఐదు మాత్రమే పూర్తయ్యాయి. ఈ విషయాన్ని కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి వెల్లడించారు. 2019-22 మధ్య దేశంలో 97,67,825 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, కానీ ఏపీలో మాత్రం కేవలం 5 మాత్రమే పూర్తయినట్లు మంత్రి తెలిపారు. ఏపీకి 1,82,632 ఇళ్లు కేటాయిస్తే 2016- 19 మధ్య 46,721 ఇళ్లు పూర్తయ్యాయని, కానీ 20189- 22 మధ్య కేవలం 5 ఇళ్ల నిర్మాణం జరిగినట్లు మంత్రి వెళ్లడించారు.