భూ యజమానికి తెలియకుండా రికార్డులలో ఎలాంటి మార్పులు వీలుపడదని జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా సంబేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు. భూ లావాదేవీల ఆధారంగానే భూ రికార్డులలో మార్పులు , అవసరమైన చోట సబ్ డివిజన్ మార్పులు చేసిన తరువాతనే రిజిస్ట్రేషన్లు ఉంటాయన్నారు. అన్నమయ్య జిల్లా లో ఇప్పటివరకు సమగ్రభూసర్వే 84 గ్రామాలలో పూర్తయిందని, 3611 భూ హక్కు పత్రాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. పట్టాదారు పాసుపుస్తకానికి, ఈ భూహక్కు పత్రానికి ఎంతో తేడా ఉందని, భూ హక్కు పత్రంలో క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, ఆ కోడ్ ను సెల్ ఫోన్ లో స్కాన్ చేస్తే భూముల వివరాలు తెలుస్తాయన్నారు. జిల్లాలో 40 వేల పట్టాలకు సబ్ డివిజన్ చేయడం జరిగిందన్నారు. సంబేపల్లె మండలంలోని సంబేపల్లె, రౌతుకుంట గ్రామాలలో 811భూ హక్కు పత్రాలను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa