టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నర్సీపట్నంలో భూ ఆక్రమణ ఆరోపణలపై ఏపీ సీఐడీ అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల హైకోర్టు విచారణ జరిపింది. 10 ఏళ్లకు పైన శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని స్పష్టం చేసింది. జలవనరుల శాఖ ఇచ్చిన ఎన్ఓసీ విలువైన పత్రాల నిర్వచనం కిందకు రాదని తేల్చిచెప్పింది. అయితే, హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.