ప్రతి పంచాయతీ కార్యదర్శి ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ సూచించారు. గురువారం పులివెందుల పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో లింగాల, సింహాద్రిపురం, తొండూరు, పులివెందుల మండలాల పంచాయతీ కార్యదర్శులకు పారిశుద్ధ్యం, పన్ను వసూలు తదితర అంశాలపై గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2024 సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డీపీఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి బాటలో నడిపంచేందుకు కార్యదర్శులకు శక్తివంతం లేకుండా పనిచేయాలన్నారు.