ఈనెల 21న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న రక్తదాన కార్యక్రమ పోస్టర్, ప్రత్యేక వెబ్ సైట్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూదన్‌రెడ్డి, పద్మజ తదితరులు పాల్గొన్నారు.