విమానాశ్రయాలలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ప్రతిపాదించిందా అలాగే విమానాశ్రయాలలో నాణ్యమైన మౌలిక సదుపాయాలను నిర్ధారించడానికి ప్రభుత్వం ఏదైనా అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తుందా అలా అయితే, దాని వివరాలు..లేదా దానికి గల కారణాలు తెలపాలని వైయస్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్రాల వారీగా నిధులు మంజూరు మరియు విడుదల చేశారా వివరాలు తెలుపగలరు అంటూ తిరుపతి ఎంపీ గురుమూర్తి గురువారం పార్లమెంట్ లో ప్రశ్నించగా అందుకు సమాధానంగా కేంద్ర విమానయాన శాఖా సహాయ మంత్రి డా.వి.కె.సింగ్ సమాధానం ఇస్తూ .. విమానాశ్రయాల అభివృద్ధి, ఆధునీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని, భూమి లభ్యత, వాణిజ్య సాధ్యత, సామాజిక-ఆర్థిక పరిగణనలు, ట్రాఫిక్ డిమాండ్ ఆధారంగా ఎప్పటికప్పుడు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మరియు ఇతర ఎయిర్‌పోర్ట్ డెవలపర్‌లచే చేపట్టబడుతుందన్నారు.