సంగం డెయిరీని చంద్రబాబు దివాళా తీయించారని మంత్రి సీదిరి అప్పలరాజు వివరించారు. డెయిరీలోకి టీడీపీ నేతలు ఎంట్రీ ఇవ్వడంతో అక్రమాలు మొదలయ్యాయని చెప్పారు. టీడీపీ నేతలు పథకం ప్రకారం డెయిరీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటైన సంగం డెయిరీని చంద్రబాబు దివాళా తీయించారు. డెయిరీలోకి టీడీపీ నేతల ఎంట్రీతో అక్రమాలు మొదలయ్యాయి.సంగం డయిరీ రైతుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన డయిరీని ఏరకంగా ప్రైవేట్‌పరం చేశారో రైతులకు వివరించాం. అక్కడి టీడీపీ నాయకుడు చౌదరి, మరో పెవ్‌మెంట్ కుక్క పట్టాభి సీఎం వైయస్ జగన్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.