ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ ను కలసిన ఎమ్మెల్యే దుద్దుకుంట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 12:33 PM

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కలిసారు. ఈ సందర్భంగా బుక్కపట్నం చెరువు ముంపు భూముల రైతులకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తిచేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి పల్లె రఘునాథరెడ్డి నిర్వాసిత రైతులకు పరిహారం అందిస్తామని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు. వైఎస్సారిసీపీ అధికారంలోకి వస్తే పరిహారం ఇప్పిస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చామని, మొత్తం 400 ఎకరాలకు సంబంధించి రైతులకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకో వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సిఫారసు చేశారు. ఈ మేరకు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు. త్వరలో పరిహారం చెల్లించే అవకాశముందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com