అనకాపల్లిలో గల రైల్వే స్టేషన్‌ను స్మార్ట్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణోను ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి గురువారం కోరారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రాన్ని అందజేసినట్టు ఇక్కడి విలేకర్లకు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో గుర్తింపు పొందిన ఏడు స్మార్ట్ రైల్వేస్టేషన్ల అభివృద్ధిలో భాగంగా అనకాపల్లిని కూడా అదే తరహాలో అభివృద్ధి చేయాలని కోరినట్టు చెప్పారు. ఇక్కడి రైల్వే స్టేషన్‌లో కోరమాండల్, ఎల్‌టీటీ, యశ్వంత్‌పూర్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని కోరానన్నారు. ఎలమంచిలి రైల్వేస్టేషన్‌లో విజయవాడ- విశాఖ మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. అలాగే, విశాఖ నుంచి బెంగళూరుకు, విశాఖ నుంచి వారణాసికి రైళ్లు మంజూరు చేయాలని, ఎలమంచిలి నియోజకవర్గం ఏటికొప్పాక బొమ్మల అమ్మకాలను వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ పథకం కింద అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో నిర్వహించాలని కోరినట్టు ఆమె తెలిపారు. అనంతరం రైల్వే బోర్డు చైర్మన్‌ను కలిసి లేఖను అందించానని చెప్పారు.