కందుకూరు పట్టణంలో దారుణ హత్యకు గురైన షేక్ జాకీర్ (32) కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాకీర్ బంధు మిత్రులు గురువారం సాయంత్రం కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. భారీ సంఖ్యలో రోడ్డు పై బైఠాయించిన యువకులు హత్యకు పాల్పడిన ఖాదర్ హుస్సేన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో ట్రాఫిక్ జామ్ కావడమే కాకుండా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ దశలో పోలీస్ అధికారులు ఆందోళనకారులకు నచ్చచెప్పి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో యువకులు ఆందోళన విరమించారు.