అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో అంకాల్ రెడ్డి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. రాజంపేట నుంచి కడపకు వెళ్ళే మార్గంలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ప్రక్కన ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలాల్ని పరిశీలించారు. మృతుడి స్వస్థలం మైదుకూరుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa