ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఏడాది భారత్ కు కష్టకాలమే!

national |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 12:50 PM

వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు కష్టకాలమేనని ఆర్బీఐ పూర్వ గవర్నర్ రఘురాన్ రాజన్ అన్నారు. వృద్ధికి అవసరమైన సంస్కరణలు తేవడంలో ప్రభుత్వం విఫలమవ్వడమే దీనికి కారణమని తెలిపారు. దేశంలో కొంత మంది పారిశ్రామిక వేత్తలకు ఒక రకమైన పరిస్థితులు, మిగిలిన ప్రజలకు మరో రకమైన పరిస్థితులు రావడం పెద్ద సమస్యేనని అభిప్రాయపడ్డారు. కోవిడ్ 19 సమయంలో ఎగువ మధ్య తరగతి వర్గాలపై ప్రభావం పడలేదని, పరిశ్రమల్లో భౌతికంగా పనిచేసే మధ్యతరగతి వర్గాలపైనే తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. దిగువ మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకొని విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు. భారత్ జోడో యాత్రలో ప్రస్తుత పరిస్థితులపై రాహుల్ గాంధీ తన అభిప్రాయాలను తెలుసుకున్నారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa