జీ20 కూటమి సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలోని కశ్మీర్ గేట్ ఐఎస్ బీటీ సమీపంలోని హనుమాన్ మందిర్ ప్రాంతంలో ఉండే బిచ్చగాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలోని రాత్రి కేంద్రాల్లో వారికి ఆశ్రయమివ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. కాగా, వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరిగే జీ20 సదస్సుకు ప్రగతి మైదానం ప్రధాన వేదిక కానుంది.