దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించి లాభాల్లోకి ఎగబాకాయి. సెన్సెక్స్ 54 పాయింట్లు లాభంతో 61,853 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 13 పాయింట్ల స్వల్ప లాభంతో 18,427 వద్ద కొనసాగుతోంది. నేడు ట్రేడింగ్ నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ కొనుగోళ్ల అండతో లాభాల్లోకి చేరాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.79 వద్ద ట్రేడవుతోంది. ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులు లభాల్లో కొనసాగుతున్నాయి. టీసీఎస్, హెచ్ సీఎల్ టెక్, టైటన్, డాక్టర్ రెడ్డీస్ నష్టాల్లో ఉన్నాయి.