లావేరు: తేనె టీగల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఖాదీ పరిశ్రమల శాఖ స్టేట్ డైరెక్టర్ గ్రిప్ అన్నారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని జీజీ వలస గ్రామానికి చెందిన 20 మంది ఎస్టీ లబ్ధిదారులకు తేనెటీగల పెంపకంపై ఈ రోజు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన లబ్ధిదారులకు సర్టిఫికెట్లు, 200 బాక్సులు, తేనె తీసే మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన లబ్ధిదారులు తేనె తీసి మార్కెటింగ్ చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. స్వచ్ఛమైన తేనెకు మంచి డిమాండ్ ఉందన్నారు.