రణస్థలం: గ్రామాభివృద్ధే లక్ష్యంగా తొమ్మిది అంశాలపై పంచాయతీ స్థాయి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చిన శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేకాహ్వానితుడు పిన్నింటి సాయికుమార్ అన్నారు. రణస్థలం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, సర్పంచులు, ఎంపీటీసీలకు ప్రజాప్రణాళికా ప్రచారం 2023-24పై శిక్షణా సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి దోహదపడే అంశాలపై ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. పేదరికం లేని మెరుగైన జీవనోపాధి, ఆరోగ్యవంతమైన, స్నేహపూర్వక బాలల గ్రామాలు, నీటి సమృద్ధి, పరిశుభ్రత, పచ్చిదనం, స్వయం సమృద్ధిలో మౌలిక వసతుల కల్పన, సామాజిక న్యాయం, సామాజిక భద్రత, సుపరిపాలనతో కూడిన గ్రామాలు, మహిళా స్నేహ పూర్వక గ్రామాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.